గుంటూరు కు చెందిన జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ వారు తోట పని పరికరాల ను కృష్ణా విశ్వవిద్యాలయం కు బహుకరించారు. శనివారం విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధి ఎంవి. చారి లక్ష రూపాయలు విలువ గల పలు రకాల తోట పని పరికరాలు అందచేశారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ సిఎస్ఆర్ కార్యక్రమం లో భాగంగా సమకూర్చిన పరికరాలు విశ్వవిద్యాలయ పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దటానికి ఉపయుక్తంగా ఉంటాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధి చారి ని సత్కరించారు. ఈ కార్యక్రమం లో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, పరీక్షల నియంత్రణ అధికారి డా. వీర బ్రహ్మచారి, ఇంజనీర్ బసవేశ్వరబాబు తదితరులు పాల్గొన్నారు.