మచిలీపట్నం :
మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో థైరాయిడ్ మెషిన్ పనిచేయడం లేదని మీడియాలో కధనాలు రావడంతో అధికారులు యుద్దప్రాతిపదికన మెషిన్ ను రెడీ చేస్తున్నారు. ఈ మెషిన్ కొన్ని టెక్నికల్ సమస్యల వలన దాదాపు రెండు సంవత్సరాలుగా రోగులకు సేవలు అందించడంలో విఫలం అయ్యింది. కొద్ది రోజులక్రితం చార్జ్ తీసుకున్న కొత్త ఇంచార్జ్ లు డిప్యుటిలు, సూపరింటెండెంట్ చొరవతో అడుగు ముందుకు పడింది.
ఈ పరిక్షలు చేయించుకోవడానికి సుమారు రెండు
సంవత్సరాలుగా పేదలు రోగులు 400 వందల రూపాయలు ఖర్చు చేసి ప్రయివేటు ల్యాబ్ ల వద్ద చేయించుకుంటున్నారు. ఇకపై ఎలాంటి సమస్య రాకుండా నిత్యం రోగులకు సేవ చేయడానికి అందరం నిబద్దతతో పనిచేస్తామని అధికారులు తెలిపారు.