శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు తెలిపారు.జిల్లా కోర్టు సాయిబాబా గుడి ముందు డ్రైనేజీ పుడుకు పోవడంతో నీరు పారుదల లేక మురుగు వాసనతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పి. వి. ఫణి కుమార్ దృష్టికి ప్రజలు తీసుకురాగా, డివిజన్ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే మంత్రి కొల్లు రవీంద్ర మున్సిపల్ కమిషనర్ కు చెప్పి సోమవారం మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వివిఎస్ బాపిరాజు డ్రైనేజీ పూడికను తీయించడం పట్ల స్థానిక ప్రజలు మంత్రి కొల్లు రవీంద్రకు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వి వి ఎస్ బాపిరాజుకు కృతజ్ఞతలు తెలిపి, హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్, ఏ .మహేష్, వార్డు శానిటేషన్ సెక్రెటరీ, మాచవరపు మానస వార్డు శానిటేషన్ మేస్త్రి, బి.వి .రామసేకర్, తదితరులు పాల్గొన్నారు.