వైఎంసిఎ ద్వారా సమాజంలో మెరుగైన క్రైస్తవ యువత
SSN
- February 11, 2026
- 0 min read
[addtoany]
మచిలీపట్నం:
క్రైస్తవ యువత లోని విభిన్న ప్రతిభాపాటవాలను వెలికితీసి వారిని మరింత ప్రోత్సాహించడం ద్వారా సమాజంలో మెరుగైన యువతగా తీర్చిదిద్దేందుకు ఇతోధిక కృషి చేస్తున్నట్లు యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆంధ్రా తెలంగాణా రీజిఒనల్ సెక్రటరీ రెవరెండ్. ధనరాజ్ పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం ఆయన కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం భాస్కరపురం లోని ఇమ్మానియేల్ గాస్ఫెల్ చర్చిలో మంగినపూడి వైఎంసిఎ ఆధ్వర్యంలో సౌత్ ఈస్ట్ ఇండియా రీజియన్ కృష్ణా గోదావరి సబ్ రీజినల్ నూతన నాయకుల ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెవరెండ్ ధనరాజ్ మాట్లాడుతూ, కృష్ణా గోదావరి జిల్లాల సబ్ రీజినల్ ఛైర్మెన్ నల్లపు నిర్మల్ హెరాల్డ్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతంలో యువతీ యువకులు పెద్ద ఎత్తున వైఎంసిఎ సభ్యత్వం ఎంతో ఉత్సాహంగా తీసుకోవడం చాలా అభినందనీయమన్నారు. తమ వైఎంసిఎ మాజీ అధ్యక్షులు డాక్టర్ రోనాల్డ్ విలియం, రీజినల్ ఛైర్మెన్ డాక్టర్ సుమన్ త్యాగరాజు, నేషనల్ వైస్ ఛైర్మెన్ డాక్టర్ బి. విలియమ్స్ ఆధ్వర్యంలో తాము అనేక ప్రాంతాలలో యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ మరింత బలోపేతం చేసేందుకు సంసిద్దమైనట్లు తెలిపారు.
భారతీయ వైఎంసిఎ మన దేశంలోని వివిధ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో క్రైస్తవ యువతీ యువకుల మెరుగైన జీవిత వికాసాభివృద్ధికి తన వంతు కృషి చేస్తుందని చెప్పారు. అందరితో స్నేహ సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడంతో పాటు లౌకిక దృక్పథంతో వైఎంసిఎ కొనసాగుతుందన్నారు. గత 170 సంవత్సరాలకు పైగా భారతీయ యువత అభివృద్ధికి తన కార్యక్రమాలను అంకితం చేసిన యంగ్ మన్ క్రిస్టియన్ అసోసియేషన్ ముఖ్యంగా భారతీయ యువత శరీరం, మనస్సు మరియు ఆత్మ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.
భారతదేశంలోని వైఎంసిఎ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అని ఎటువంటి లాభాపేక్షలేని సమూహాల భాగస్వాములతో పనిచేస్తూ క్రీడలు , ఆరోగ్య సంరక్షణ, విద్య, వృత్తి శిక్షణ, అవగాహన , ఆదాయ ఉత్పత్తి కార్యక్రమాలలో సమాజంలోని బలహీన వర్గాలకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మరియు సేవలను అందిస్తుందని వివరించారు .
ఈ శిక్షణా కార్యక్రమంలో కర్నూల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎడ్మన్డ్ కృపానందం, సబ్ రీజినల్ ట్రెజరర్ సురేష్, భీమవరం రీజినల్ కార్యదర్శి మేరీ శ్యామ్, స్థానిక 13 వ డివిజన్ కార్పొరేటర్ బందెల థామస్ నోబుల్ , గెరా ఇర్విన్ స్కాట్ విద్యా సాగర్, యషియా రాజ్, సురేష్, గరికిముక్కు జయరాజు, జర్నలిస్ట్ కృష్ణారావు, చంద్రశేఖర్, గొట్రు సందీప్, మంగం ఇజ్రాయిల్ పాల్ (పండు), మంగం జోసెఫ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

