MachilipatnamLocal News
February 12, 2026
పోలీస్ డైరీ

మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు

  • February 10, 2026
  • 1 min read
[addtoany]
మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు
మచిలీపట్నం :
 
      మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితునికి మరణించెంత వరకు జైలు శిక్ష (జీవిత కాలపు) 6,000/- రూపాయల జరిమానా విధించిన విజయవాడ, పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి వేల్పుల భవానీ. పూర్తి వివరాలు కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని మంటాడ గ్రామంలో ఫిర్యాది తన తల్లితో కలసి నివాసం ఉంటున్నట్లు, ఆమె తల్లి దండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ సంతానం అయినట్లు, తల్లి దండ్రులు మనస్పర్థల కారణంగా విడిపోయి ఇద్దరు ఆడపిల్లలు తల్లితోకలసి మంటాడ గ్రామం లో నివాసం ఉంటున్నట్లు, ఫిర్యాది తండ్రి / అన్న కొమ్ము సౌల్ ఇద్దరు ప్రకాశం జిల్లాలోని, కొండెపి మండలం, పెట్లూరు గ్రామంలో ఉంటున్నట్లు, 2023 సంవత్సరంలో ఫిర్యాది అన్న సౌల్ తన తల్లి వద్దకు మంటాడ గ్రామం వచ్చి వెళ్ళినట్లు అప్పటినుండి తన తల్లి మరియు చెల్లి తో మాట్లాడుతున్న క్రమంలో ఫిర్యాదితో నువ్వు నాకు ముద్దు పెట్టుకున్న ఫోటోస్ ఉన్నాయని ఫిర్యాదిని బెదిరించి పలుమార్లు శారీరకంగా కలిసినట్లుగా అలాగే ది. 2024 క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఇంటికి తీసుకువెల్లకుండా విజయవాడలోని, గుణదల మేరీ మాత చర్చి కి తీసుకువెళ్ళి తాళికట్టి అనంతరం విజయవాడ బస్ స్టాండ్ వద్ద గల లాడ్జి కి తీసుకువెళ్ళి శారీరకంగా కలిసినట్లు, తర్వాత అక్కడనుండి పెట్లూరు గ్రామం తీసుకెళ్ళి అక్కడ రెండు రోజుల తర్వాత ఫిర్యాది తండ్రి మరియు అన్న ఇద్దరు కలసి ఫిర్యాదిని పని నిమిత్తం అని చెప్పి హైదరాబాద్ లోని తుక్కుగూడ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉంటున్న క్రమంలో ఫిర్యాది అన్న తండ్రి లేని సమయంలో బలవంతంగా అనేక సార్లు శారీరకంగా కలిసినాడు. కొంతకాలం తర్వాత ఫిర్యాది తల్లి పెట్లూరు గ్రామం వచ్చి కొడుకు సౌల్ కి ఫోన్ చేసి ఫిర్యాదిని పెట్లూరు గ్రామం పంపించమని చెప్పగా 2025 తేదీన ఫిర్యాది అన్న మరియు తండ్రి ఇద్దరు ఫిర్యాదిని హైదరాబాద్ నుండి తీసుకుని వచ్చి ఒంగోల్ బస్ స్టాండ్ లో దింపి హైదరాబాద్ వెళ్లిపోయారు. అంతటా ఫిర్యాదిని ఆమె చెల్లి , పెదనాన్న కొడుకు ఇద్దరు ఒంగోల్ బస్ స్టాండ్ కి వచ్చి ఫిర్యాదిని పెట్లూరు గ్రామంలోని ఇంటికి తీసుకువెళ్ళినారు. కొన్ని రోజుల తర్వాత ఫిర్యాదికి జ్వరం, వాంతులు అవుతుండగా ఫిర్యాది తల్లికి అనుమానం వచ్చి ప్రెగ్నెంకి కిట్ తో పరీక్షించగా ప్రెగ్నెంట్ అని తెలిసినది. అంతటా ఫిర్యాదిని ఏమి జరిగినది అని అడుగగా తన అన్న అయిన కొమ్ము సౌల్ ఫిర్యాదిని బెదిరించి వివాహం చేసుకుని పలుమార్లు బలవంతంగా శారీరకంగా కలిసినడని చెప్పినది. అంతట ఫిర్యాది తల్లి ఫిర్యాదిని వెంట పెట్టుకుని కొండెపి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వగా వారు జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి పమిడిముక్కల పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు.. కృష్ణా జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు నిందితుడు పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఫోక్స్ కోర్టు నందు ప్రవేశపెట్టారు. పూర్తి విచారణ అనంతరం నిందితుడికి జీవిత ఖైదు విధించింది ఫోక్సో కోర్టు.
 
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా మహిళల పట్ల చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన, వారిపై అఘాయిత్యాలకు తెగబడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడేది లేదని, కృష్ణా జిల్లా పోలీసులు మహిళలపై జరిగే నేరాల పట్ల కఠినంగా గా వ్యవహరిస్తారు అనడానికి ఈ కోర్టు తీర్పు ఒక ఉదాహరణ అని తెలియజేశారు. సమాజంలో మహిళలు గాని చిన్నారులు గాని ఎవరైనా ఇటువంటి నేరాలలో చిక్కుకుంటే ధైర్యంగా వచ్చి పోలీసు వారి సహాయాన్ని పొందవచ్చని ఫిర్యాదు చేయడానికి వెనుకాడ వద్దని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో డిఎస్పి కి సహకరించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డ్ అందించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *