ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని కళాశాల ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మచిలీపట్నం లేడీ యాంప్తుల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రముఖ వైద్యులు డాక్టర్ తాత నీలిమా చే ” క్యాన్సర్ పై అవగాహన సదస్సు” ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ నీలిమా మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో ఎక్కువమంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలియజేశారు. క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలని దాని నివారణ చికిత్సలు చేసుకుంటే క్యాన్సర్ రోగాన్ని జయించవచ్చు ఆమె తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాల్గొని 2000 సంవత్సరంలో ప్యారిస్ లో జరిగిన “వరల్డ్ సమీట్ ఎగైనెస్ట్ క్యాన్సర్” లో నిర్ణయం తీసుకున్నారని, ఆ మేరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న క్యాన్సర్ వ్యతిరేక దినోత్సవం గా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
క్యాన్సర్ పట్ల అవగాహన పెరగటం వల్ల మరణాలు తగ్గించవచ్చని మరియు వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించవచ్చు అని ప్రాథమిక దశలో చికిత్సతోనే క్యాన్సర్ ని జయించండి అనే నినాదంతో దేశ వ్యాప్తంగా వైద్య రంగంలో మార్పు వచ్చిందని తెలియజేశారు. ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి క్యాన్సర్ నివారణకు వైద్యం అందించాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని తెలియజేశారు.
ప్రిన్సిపాల్ పి లక్ష్మి మాట్లాడుతూ ధూమపానం, మద్యం పొగాకు దూరంగా ఉండాలని పీచు పదార్థాలు పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం చేస్తూ బరువును అదుపులో పెట్టుకోవడం వల్ల క్యాన్సర్ ని నివరించా వచ్చు అని తెలియజేశారు. ప్రతి ఆరు నెలలకు క్రమం తప్పకుండా క్యాన్సర్ పై స్క్రీనింగ్ టెస్ట్ లు చేయించుకున్నట్లయితే ప్రారంభ దిశలోనే నివారణ చేయవచ్చని తెలియజేశారు.
దాదాపు 30 నుండి 50 శాతం వరకు క్యాన్సర్ మరణాలను ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు ముందస్తు గుర్తింపు ద్వారా నివారించుకోవచ్చు అని డాక్టర్ నీలిమా తెలియజేశారు. మహిళలు ఎక్కువ మంది నిర్లక్ష్యం చేయటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కు గురవుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరనాధ్ బాబు అధ్యాపకులు మున్వర్ ;శ్రీనివాస్, జయప్రకాషష్ , జ్యోతి ,రత్న పాల్గొన్నారు.