క్యాన్సర్ రాకుండా ముందుస్తు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు లో క్రమశిక్షణ అవసరం అని వక్తలు ఉద్బోధించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భముగా కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ విభాగాల ఆధ్వర్యములో బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాలలో వేర్వేరుగా అవగాహన సదస్సు లు నిర్వహించారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో నిర్వహించిన సదస్సులో బయోటెక్నాలజీ విభాగం సహాయ ఆచార్యులు డా ఎల్. సుశీల క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు పై వివరించారు.
ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ క్యాన్సర్ తొలి దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే నివారణ సులభం అన్నారు. ఇంజనీరింగ్ కళాశాల లో నిర్వహించిన సదస్సులో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారీ కవిత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి, ఆచార్య మారుతి, డా. సల్మా, డా. శేషా రెడ్డి, డా. శాంతికృపా, రంగమణి విద్యార్ధులు పాల్గొన్నారు.