హైదరాబాద్ :
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేయవలసిందేనని, అంతమాత్రాన నిరుత్సాహ పడవద్దని, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళి, ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హ్యాండ్లూమ్స్ కమిషనర్, టెస్కో వైస్ చైర్మన్, ఎండి శైలజ రామయ్యార్ అన్నారు.
పదవి విరమణ చేసినా ఇంకా జీవితం ఎంతో ఉందని ఆ సమయాన్ని సమాజ సేవ కోసం వినియోగిస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం లిమిటెడ్ టెస్కోలో జనరల్ మేనేజర్ ఫైనాన్స్ మేనేజర్ అడ్మిన్ గా సుదీర్ఘకాలం పనిచేసిన ఎం రఘునందన్ రావు ఉద్యోగులందరి అభిమానాన్ని పొందారని ముఖ్య అతిథిగా పాల్గొన్న శైలజ రామయ్యార్ అభినందించారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా టెస్కో సంస్థను అభివృద్ధి చేయడంలో రఘునందన్ పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. రాష్ట్ర విభజన అనంతరం ఆప్కో నుండి టెస్కో సంస్థగా ఆవిర్భవించిన తరుణంలో ఎదురైన అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సంస్థ అభివృద్ధికి కీలకపాత్ర పోషించారని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో చేనేతజౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ లు ఎం వెంకటేశ్వరరావు ,ఇందుమతి, డిప్యూటీ డైరెక్టర్ నాగలత, టెస్కో మార్కెటింగ్ ఓఎస్డి రతన్ కుమార్ , టెస్కో ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ సుధాకర్ రెడ్డి ,వర్కింగ్ ప్రెసిడెంట్ విజయకుమార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ హైదరాబాద్ హిమజా కుమార్ ,అసిస్టెంట్ డైరెక్టర్లు సందీప్ జోషి ,నంద చారి, టెస్కో టెలివిజన్ మార్కెటింగ్ అధికారులు కళింగారెడ్డి ,వెంకటేశ్వర్లు, జనార్ధన్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా టెస్కో సంస్థ తదుపరి ఫైనాన్స్ జనరల్ మేనేజర్ కళింగ రెడ్డి అడ్మిన్ జనరల్ మేనేజర్ గా మాధవి లకు పూర్తి అదనపు బాధ్యతలతో శైలజ రామయ్యర్ నియమించారు.