మచిలీపట్నం :
కుష్టు వ్యాధి ని నిర్మూలించడానికి ఈ రోజు స్పర్శ్ అవగాహనా కరపత్రములను పోస్టర్స్ ను ఆవిష్కరించి, స్పర్శ్ అవగాహనా కార్యక్రమములు జిల్లా లో నిర్వహించవలెను జిల్లా కలెక్టర్ డి. కె. బాలాజీ తెలియపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ప్రజల్లో కుష్టు వ్యాధి పై పూర్తి చైతన్యం తీసుకురావడం, శుభ్రత, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై పూర్తి అవగాహన కలిగించడం ద్వారా కుష్టు వ్యాధి నిర్మూలనకు సిబ్బంది అంకితభావంతో పనిచేయడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని శ్రీ. డి. కె. బాలాజీ, కలెక్టరు గారు అన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ భాగస్వాములై కుష్టు వ్యాధి నివారణకు, నిర్మూలనకు అంకితభావంతో పనిచేయాలన్నారు.
డీ ఎం హెచ్ ఓ Dr. P. యుగంధర్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి బారిన పడినవారిపై వివక్షను అంతం చెయ్యడం గౌరవాన్ని కాపాడటం అను నినాదంతో ఈ కార్యక్రమము నిర్వహించవలెనని తెలియపరిచారు.
DLATO Dr. A. వెంకటరావు మాట్లాడుతూ స్పర్శ్ కార్యక్రమమును సమర్థవంతంగా నిర్వహించి కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించవలెనని తెలియపరిచారు.