ప్రభుత్వ శాఖల పనితీరు సరిచేసుకోవాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
SSN
- February 3, 2026
- 1 min read
[addtoany]
మచిలీపట్నం:
వచ్చేవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉన్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ శాఖల కీలక పనితీరు సూచికలను వెంటనే సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చేవారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ఆ లోగా అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కీలక పనితీరు సూచికలు సరి చూసుకోవాలని ఇతర జిల్లాలతో పోలిస్తే కృష్ణాజిల్లా వెనుకబడి ఉండరాదని5 వ తేదీలోగా నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు సూచించారు.
ప్రభుత్వం తరఫున ప్రజలకు అందించే సేవలు ఏ ఒక్కటిలోను జిల్లా వెనుకబడి ఉండరాదని, ప్రజలు సానుకూల దృక్పథంతో ఉండేలా ప్రతి ఒక్కరూ పనితీరు కనపరచాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయం ఉంటే వెంటనే అక్కడ సేవలను మరింత మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడం క్షేత్రస్థాయిలో బాగుందని, జిల్లా స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవలసి ఉందని తెలియజేస్తూ ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు.
ప్రజల నుండి స్వీకరించే మీకోసం అర్జీల పట్ల అత్యంత ప్రాధాన్యత వహించి పరిష్కరించాలన్నారు.
కొంతమంది అధికారులు ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు అర్జీలకు ఎండార్స్మెంట్ బాగానే ఇస్తున్న దానికి సంబంధించిన కేటగిరి కింద కాకుండాబిఅర్జీదారుడు లబ్ధి పొందినట్లుగా తప్పుగా చూపిస్తున్నారని, దీంతో మరల అదే అర్జీలు వస్తున్నాయన్నారు. అలా కాకుండా త్వరలో లబ్ధి పొందుతారని లేదా ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకోవాలని ఐచ్చికాలను ఎంచుకోవాలన్నారు. ఇదివరకే పలుమార్లు తాను శిక్షణ ఇచ్చినప్పటికీ చేసిన తప్పుని మరల చేయడం సరైనది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా సరైన ఎంపిక చేసుకోవాలన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. ఇంకనూ 16 మంది ప్రభుత్వ శాఖల అధికారులు 57 అర్జీలను చూడకపోవడం సరైనది కాదని స్పష్టం చేస్తూ వెంటనే వాటిని పరిశీలించి పరిష్కరించాలన్నారు.
జిల్లాలో 1921 అన్ క్లెయిమెడ్ బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, అందులో 1725 ఖాతాలను ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించినవో గుర్తించామని, ఇంకనూ 196 ఖాతాలు గుర్తించవలసి ఉందన్నారు.
గుర్తించిన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు వెంటనే సంబంధిత బ్యాంకులను సంప్రదించి వారికి సంబంధించిన కార్యాలయ గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలు అందజేసి ఖాతా చురుకుగా పనిచేసేటట్లుగా చొరవ తీసుకోవాలన్నారు.
ఈనెల 6 లేదా 7 తేదీలలో కలెక్టరేట్లో “అమృత కృష్ణ ” పేరుతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక మంచి నీటి శుద్ధి గాజు సీసాలతో కూడిన కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని అక్కడి నుండి కలెక్టరేట్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు మంచినీటిని గాజులు సీసాలలో సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అప్పటినుండి కలెక్టరేట్లో ఏ ఒక్క కార్యాలయంలో కూడా ప్లాస్టిక్ సీసా వాడకం ఉండరాదని, ప్లాస్టిక్ సీసా కనిపించరాదని స్పష్టంగా ఆదేశించారు. అప్పుడప్పుడు తాను తనిఖీ కూడా చేస్తానని హెచ్చరించారు.
ఈనెల 4 లేదా 5 తేదీలలో సింగపూర్ నుండి ఒక ప్రత్యేక బృందం ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్నం, అమరావతి మూడు ఆర్థిక ప్రాంతాల్లో పర్యటించనుందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఆర్థిక పురోభివృద్ధి ప్రణాళికపై వారికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లను తయారుచేసి వెంటనే అందజేయాలన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా అధికారులు అందరూ కలిసికట్టుగా తన పిలుపుమేరకు” కృష్ణా సంకల్పం ” పేరుతో విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన శానిటరీ ఇన్సినీరేటర్లు , చిన్నపాటి బల్లలను సమకూర్చినందుకు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులందరినీ అభినందిస్తూ వారికి ఒక ప్రశంసా పత్రము, బహుమతిని అందజేశారు.
గత జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేసిన జిల్లా ఉపాధి కల్పనాధికారి విక్టర్ బాబును జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
జిల్లాలో 2018 నుండి జిల్లా ఉపాధి కల్పనాధికారిగా విక్టర్
బాబు పనిచేస్తూ 34 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విక్టర్ బాబు అప్పగించిన గత సాధారణ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలలో వెబ్ కాస్టింగ్ నోడల్ అధికారిగా, తదుపరి కృత్తివెన్ను మండల ప్రత్యేక అధికారిగా, పరిశ్రమల నెలకొల్పుటకు సంబంధించి ప్రత్యేక అధికారిగా ప్రజల నుండి వచ్చిన మీకోసం అర్జీలను పరిష్కరించడంలోను, విరివిగా జాబ్ మేళాలు నిర్వహించడంలోనూ విశేష కృషి చేశారని జిల్లా కలెక్టర్ కొనియాడారు.
అనంతరం ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే మీకోసం కార్యక్రమంలో అది పాల్గొనే అధికారులతో పాటు వచ్చే ప్రజలకు కూడా అల్పాహారం అందించి తమ వంతు సహకారం అందిస్తున్న న నగరంలోని ఈడేపల్లి సత్యసాయి సేవా సమితి, బాలాజీ భజన మండలి సభ్యులు హనుమకొండ వెంకటేశ్వరరావు వారి బృంద సభ్యులను జిల్లా కలెక్టర్ అభినందిస్తూ ప్రశంసా పత్రముతో పాటు ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, మెప్మా పీడీ సాయిబాబు, కే ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి,, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్ జిజిహెచ్ పర్యవేక్షకులు డాక్టర్ ఆశాలత పంచాయతీరాజ్ చేసి రమణ రావు డిఎస్ఓ మోహన్ బాబు, పౌరసరఫరాల సంస్థ డిఎం శివరాం ప్రసాదు ఐ సి డి ఎస్ పి డి ఎం ఎన్ రాణి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖరు, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్, ఉద్యాన అధికారి జె జ్యోతి, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, డిటిడబ్ల్యుఓ ఫణి ధూర్జటి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
—————————————
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది.

