కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బి.టెక్ – VII సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు 2,ఫిబ్రవరి 2026 సోమవారం కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి కూన రాంజీ, పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి విడుదల చేశారు.
పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేయదలచిన విద్యార్ధులు 9,ఫిబ్రవరి 2026 వరకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో సూచించిన రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పునఃమూల్యాంకనానికి సంబంధించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ (www.kru.ac.in) లో పొందుపరిచినట్లు డా. పి. వీర బ్రహ్మచారి తెలిపారు.
సంబంధిత విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చని వారు సూచించారు.