మచిలీపట్నం :
జిల్లాలో వేగంగా అనుమతులు మంజూరు చేసి విరివిగా పరిశ్రమలు నెలకొల్పుటకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశము నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వాముల సదస్సు లో భాగంగా భారీ పరిశ్రమలు నెలకొల్పుటకు ఒప్పందాలు చేసుకొని ముందుకు వచ్చిన 10 కంపెనీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వేగంగా వ్యాపార అనుమతులు (స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్) మంజూరు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వారు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని తద్వారా వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
జిల్లాలో సింగిల్ డెస్క్ పాలసీ కింద 1491 దరఖాస్తులు అందగా ఇప్పటివరకు 1471 దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు ఇంకను మిగిలిన 20 దరఖాస్తులను కూడా సత్వరమే పరిశీలించి సత్వరమే అనుమతులు మంజూరు చేయుటకు చొరవ చూపాలన్నారు.
పీఎం విశ్వకర్మ పథకం కింద 2051 యొక్క దరఖాస్తులను రుణాలు మంజూరుకు బ్యాంకులకు పంపామని వాటిలో 873 దరఖాస్తులకు సంబంధించి యూనిట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మిగిలిన యూనిట్లు కూడా త్వరితగతిన మంజూరు చేయాలన్నారు.
ప్రధానమంత్రి ఉపాధి హామీ కార్యక్రమం కింద 213 దరఖాస్తులు బ్యాంకులకు పంపగా అందులో 134 యూనిట్లు నెలకొల్పారన్నారు.
ఎం ఎస్ ఎం ఈ క్లేయిముల కింద 3 దరఖాస్తులకు సంబంధించి 89.50 లక్షల రూపాయల పెట్టుబడి రాయితీ, స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు రాయితీ లు జిల్లా కలెక్టర్ మంజూరు చేస్తూ ఉత్తరుడు జారీ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వెంకటరావు, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ బాబ్జి, ఎల్డియం రవీంద్రారెడ్డి, డి టి డబ్ల్యూ ఓ ఫణి ధూర్జటి, జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణ తదితర అధికారులు, పలువురు బ్యాంకర్లు పాల్గొన్నారు.