MachilipatnamLocal News
April 3, 2026
కృష్ణా జిల్లా

బిజీగా రిజిస్ట్రార్ కార్యాలయాలు

  • January 29, 2026
  • 0 min read
[addtoany]
బిజీగా రిజిస్ట్రార్ కార్యాలయాలు
మచిలీపట్నం :
 
         సోమవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయన్న అభిప్రాయంతో కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం బిజీగా ఉంది. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అమ్మకాలు కొనుగోలుదారులతో కిక్కిరిసింది. రిజిస్ట్రేషన్ చార్జీలు విపరీతంగా పెరిగిపోతాయని అభిప్రాయంతో గురువారం ఉదయం నుండి జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా ఉన్నాయి. ఈ సందర్భంగా పార్టీలు ఇరువురు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం చెట్ల కింద వేచి ఉన్నారు. 
       రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతున్నాయని ప్రచారంతో తమ భూమి విలువ చార్జి పెరగటం తో ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, చల్లపల్లి, అవనిగడ్డ, మొవ్వ, ఉయ్యూరు, కంకిపాడు, గన్నవరం, గుడివాడ పలు రిజిస్టర్ కార్యాలయాలు పార్టీలతో రద్దీగా కనిపించి, రిజిస్ట్రేషన్ తో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *