MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

విజయవంతమైన బ్యాంకు ఉద్యోగుల సమ్మె

  • January 27, 2026
  • 0 min read
[addtoany]
విజయవంతమైన బ్యాంకు ఉద్యోగుల సమ్మె
సమ్మెకు సిఐటియు సంఘీభావం
 
మచిలీపట్నం :
 
      దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న బ్యాంకు ఉద్యోగు లకు కృష్ణా జిల్లా సిఐటియు యూనియన్ నాయకులు టీ చంద్రపాల్ మాజేటి శ్రీనివాసరావు, ఎండి కరీముల్లా ఓ గంగాధర్ ప్రసాద్ మచిలీపట్నంలో మంగళవారం బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న ఆందోళన న్యాయమైనదని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
        కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేస్తూ సామాన్య ప్రజానీకంపై కార్మికుల రైతు వర్గాలపై దాడి తీవ్రతరం చేసిందని ఈ సమస్య ఇలాగే కొనసాగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు బ్యాంకు ఉద్యోగాలు చేస్తున్న ఆందోళనకు సిఐటియు కృష్ణా జిల్లా కమిటీ పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *