MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • January 24, 2026
  • 1 min read
[addtoany]
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం: 
 
       స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా స్వచ్ఛ జిల్లా లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
 
       శనివారం ఉదయం ఆయన నగరంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని కార్యాలయ ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు.
       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పది సూత్రాలు రూపొందించిందని, అందులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఒకటని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లాలో ప్రతి నెలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆ విధంగా ప్రతి నెలలో ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఎంచుకుని, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి శుభ్రం చేస్తూ ముందుకెళ్తున్నామని, నేడు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశామన్నారు. 
 
         అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆ నెలకు నిర్దేశించిన ఇతివృత్తం ప్రకారం వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెబుతూ, ఈ నెలకు జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర అనే ఇతివృత్తం అని తెలిపారు.
 
        గత నెలలో స్వచ్ఛమైన గాలి (క్లీన్ ఎయిర్) అనే ఇతివృత్తంతో కార్యక్రమం నిర్వహించామన్నారు. నగరంలో కాలుష్య రహిత వాయువు లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పెట్రోల్, డీజిల్ వంటి చమురు ఆధారిత వాహనాలకు బదులుగా సైకిల్ వినియోగంతో వాయు కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. కలెక్టరేట్లో విధులకు హాజరయ్యే జిల్లా కేంద్రం పరిధిలోని ఉద్యోగి సైకిల్ లేదా కాలినడకన విధులకు హాజరు కావాలని సూచించామని, చాలామంది ఉద్యోగులు స్వచ్ఛందంగా అలా రావడం అభినందనీయమన్నారు. సైకిల్ తొక్కడం వల్ల మంచి ఆరోగ్యం పెంపొందడమే కాకుండా శబ్ద, వాయు కాలుష్యం తగ్గి ప్రకృతికి మేలు జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహించేందుకు జిల్లాలోని ప్రజలకు అందుబాటు ధరలో ఈ–సైకిల్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నామని, సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
 
       కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, మచిలీపట్నం మార్కెట్ యార్డు ఛైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, జిల్లా రిజిస్ట్రార్ ఎంఎస్ గోపాలకృష్ణ మూర్తి, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, కలెక్టరేట్ ఏవో రాధిక, డీఈవో యు వి సుబ్బారావు, మార్కెటింగ్ ఎడి నిత్యానంద్, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *