శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గూడూరు గ్రామం పర్యటనలో భాగంగా మచిలీపట్నం నుంచి గూడూరుకు, అదేవిధంగా తిరిగి గూడూరు నుంచి మచిలీపట్నంకు దాదాపు 20 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించారు.
జిల్లా కలెక్టర్ సైకిల్ తొక్కుతూ వెళ్లడాన్ని మార్గం వెంబడి పలువురు ఆసక్తిగా గమనించారు. గతంలో సైతం జిల్లా కలెక్టర్ మచిలీపట్నం నుంచి మంగినపూడి బీచ్ వరకు దాదాపు 25 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు.