గంజాయి పై ఉక్కు పాదం
మచిలీపట్నం :
ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న గంజాయి కి సంబంధించి శనివారం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ పెరేడ్ మైదానం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వివరించారు.
హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, ఆత్కూరు ఎస్ఐకి రాబడిన సమాచారం మేరకు శుక్రవారం సుమారు రాత్రి 09.00 గంటలకు చిన్నవుటపల్లి, మధుఖాన్ కటింగ్ దగ్గరలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు AP39UP 4715 ఐచర్ వ్యాన్ ను చిన్నవుటపల్లి, మధుఖాన్ కటింగ్ సమీపానికి వచ్చుసరికి పోలీస్ వారిని చూసి వ్యాన్ ను మధుఖాన్ ఇండస్ట్రీస్ రోడ్ వైపుకి త్రిప్పుకుని పారిపోతూ ఉండడాన్ని వివాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ సిబ్బంది గమనించారు.
ఎస్ ఐ తన సిబ్బంది సహాయంతో ఇద్దరినీ పిన్నమనేని హాస్పిటల్ వెనుక వైపు, ఆదిత్య వెంచర్స్, గంగనమ్మ గుడి దగ్గరలో పట్టుకొని తనిఖీ చేసి వారివద్ద నుండి సుమారు 171.2 Kgs గంజాయిని, రెండు సెల్ ఫోన్ లు, ఐచర్ వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు అని ఎస్పి తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వంటివి యువత జీవితాలను నిర్వీర్యం చేయడమే కాక వారికి అందవలసిన బంగారు భవిష్యత్తును అందకుండా చేస్తుంది. కావున ఎవరికైన గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు వంటి వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ వారికి, ఈగల్ టీంకు సమాచారం అందిస్తే అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.
గంజాయిను తరలించే వారిని చాకచక్యంగా పట్టుకున్న గన్నవరం డిఎస్పి ని, హనుమాన్ జంక్షన్ ఇన్స్పెక్టర్ ని, ఆత్కూరు ఎస్సై, సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వివి నాయుడు, అడిషనల్ ఎస్పి ఏ ఆర్ బి.సత్యనారాయణ, గన్నవరం డిఎస్పి సిహెచ్ శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.