కృష్ణా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి దాన్ని నిలబెట్టుకోవడానికి ఓటరుగా మన వంతు నిర్వర్తించాల్సిన కర్తవ్యం గురించి విద్యార్థులకు వివరించారు.
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె రాంజీ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు కున్న విసిష్టత, ప్రాముఖ్యత గురించి చెప్పారు… తదుపరి వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎం.వి బసవేశ్వర రావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండినా ఇంకా ఓటు నమోదు చేసుకోని విద్యార్థులు ఎవరైనా ఉంటే గనుక యుద్ధ ప్రాతిపదికన ఆ కార్యక్రమాన్ని పూర్తిచేసుకోవాలని, ఓటు యొక్క విలువ తెలుసుకొని ముందుకు సాగాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పుకొచ్చారు…
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా. ఆర్ విజయ్ కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు దుర్గాప్రసాద్ రాజులపాటి, రంగ శ్రీ, డా. రవి, డా సల్మా డా. శేషారెడ్డి , బోధన సిబ్బంది పాల్గొన్నారు.