మచిలీపట్నం:
జిల్లాలో వ్యాపారవేత్తలు, వ్యాపార సంఘాలతో కలిపి బిజినెస్ మీట్ త్వరలో ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో బిజినెస్ మీట్ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు వారికి సంబంధించిన ఉత్పత్తులు బాగా అమ్మకాలు పెరగడానికి మార్కెట్ లింకేజీ పటిష్టంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. బాగా సామర్థ్యం ఉన్న కొనుగోలుదారుల నుంచి వారికి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చే విధంగా కృషి చేయాల్సి ఉందన్నారు.
ఇందుకోసం జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వ్యాపారవేత్తలతో జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఉన్నటువంటి వ్యాపార సంఘాలు, ఏజెన్సీలతో కలుపుకొని త్వరలో బిజినెస్ మీట్ నిర్వహించుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోగా అనుకున్న విధంగా లక్ష్యం నెరవేరాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా పిఎఫ్ఎంఈ పథకానికి సంబంధించి 156 యూనిట్లు నెలకొల్పవలసి ఉండగా ఇప్పటివరకు 32 మంజూరయ్యాయని, 21 యూనిట్లకు సంబంధించి మంజూరీలు బ్యాంకుల వద్ద పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే మంజూరు చేయాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓకి చంద్రశేఖర రావు డిఆర్డిఏ పిడి హరినాథ్ ఎల్ డి ఎం రవీంద్రారెడ్డి డిఐసి జిఎం వెంకటరావు, ఉద్యాన అధికారి జ్యోతి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ పాపయ్య, ఖాదీ విలేజ్ బోర్డు ఏడి శరభల కుమార్ తదితరులు పాల్గొన్నారు.