మచిలీపట్నం :
జిల్లా కేంద్ర గ్రంథాలయం, మచిలీపట్నం ను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ మెంబర్ పద్మజ ఆకస్మికంగా సందర్శించి గ్రంథాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయంను పాఠకులు, నిరుద్యోగులు విరివిగా వినియోగించుకుని ఉన్నత స్థాయిలో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ బి.విజయ్ కుమార్, అసిస్టెంట్ లైబ్రేరియన్ కె వి వి యన్ బసవేశ్వరరావు కార్యాలయ సిబ్బంది, డి సి యల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.