MachilipatnamLocal News
February 12, 2026
ఫీచర్స్

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటిలకు జాటోతు అమ్ములు ఎంపిక

  • January 18, 2026
  • 0 min read
[addtoany]
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటిలకు జాటోతు అమ్ములు ఎంపిక
మచిలీపట్నం:
 
      గూడూరు మండలం జడ్పీహెచ్ఎస్ తీగల వేణి పాఠశాలకు చెందిన ఆరవ తరగతి విద్యార్థిని జాటోతు అమ్ములు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు షారుక్, గొల్లపూడి రాణి పీడీలు తెలిపారు. 
 
        జనవరి 15వ తేదీన మహబూబాబాద్ జిల్లాలో అథ్లెటిక్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలో పాల్గొని సబ్ జూనియర్ అభ్యర్థులలో 60 మీటర్ల విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సంపాదించి జనవరి 18, 2026న ఆదిలాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయినది. 
 
          ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు షారుక్ ఉపాధ్యాయుల బృందం మరియు గ్రామ సర్పంచ్ ధారావత్ రాజు అభినందించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *