మచిలీపట్నం:
జనవరి 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పోలీసు కవాతు మైదానంలో జరిగే జిల్లా స్థాయి వేడుకలకు జిల్లా ప్రగతిని వివరించేలా శకటాల రూపకల్పన చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి శనివారం ఉదయం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శకటాల రూపకల్పనపై చర్చించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు, జిల్లా ప్రగతిని వివరించేలా శకటాలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్), పేదరిక నిర్మూలన (జీరో పావర్టీ), స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర, నీటి నిర్వహణ, నైపుణ్య అభివృద్ధి, కలంకారి, అనుకరణ ఆభరణాలు, పీఎం సూర్య ఘర్, పీఎం ఈజిపి, పీఎం ఎఫ్ఎంఈ, మచిలీపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ వంటి ఇతివృత్తాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ కే చంద్రశేఖరరావు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.