MachilipatnamLocal News
February 12, 2026
ఫీచర్స్

జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

  • January 14, 2026
  • 0 min read
[addtoany]
జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

   జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, లింగాల గ్రామంలో జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో  సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.

         సంప్రదాయ పద్ధతిలో సాగిన సంక్రాంతి సంబరాలలో 150 మంది పిల్లలకు గాలి పటాలు పంచిపెట్టారు. కోలాటాలు, గంగిరెద్దుల ప్రదర్శనలు ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 50 మంది చిన్నారులకు విద్యాభారతి వైస్ ప్రెసిడెంట్  వెలగపూడి రామకృష్ణ దంపతుల చేతుల మీదుగా భోగిపళ్లు పోశారు. 200 మంది మహిళల తో ముగ్గుల పోటీలు నిర్వహించగా మొదట బహుమతి ఫ్రిడ్జ్, రెండవ బహుమతి వెట్ గ్రైండర్, మూడవ బహుమతి ఎలక్ట్రిక్ కుక్కర్, 2 క్యాష్ కన్సలేషన్ బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ కన్సలేషన్ బహుమతులు అందించారు.
        మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిటికల్ సెక్రటరీ, పోలిట్ బ్యూరో మెంబర్, జయప్రద, ఎన్టిఆర్ లిటరేచర్ కమిటీల చైర్మన్ టీ డీ జనార్ధన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనింగ్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి  కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొనగా మాజీ మంత్రి, కెడీసీసీ బ్యాంకు చైర్మన్  నెట్టం రఘురామ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్, అధికార భాషా సంఘం చైర్మన్  విక్రమ్ పూల, నాటక అకాడమి చైర్మన్  గుమ్మడి గోపాల కృష్ణ, ఉర్దూ అకాడమీ చైర్మన్  ఫరూక్ షుబ్లీ, విద్యాభారతి వైస్ ప్రెసిడెంట్  వెలగపూడి రామకృష్ణ, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు  పిల్లి సురేంద్ర అతిధులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 1500 మందికి బోజనాలు ఏర్పాటు చేసి ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *