దివంగత ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్యులునందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ బుధవారం ఉదయం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరిగింది.
మచిలీపట్నం హౌసింగ్ బోర్డు బైపాస్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని రాష్ట్ర ఎక్సైజ్, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ,బిజెపి జిల్లా అధ్యక్షులు చిగురుపాటి శ్రీరామ్, డిసిఎంఎస్ చైర్మన్ జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు వీరాభిమానులను మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా సన్మానించారు.
అనంతరం మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయి, దివంగత ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్యులు నందమూరి తారక రామారావు విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు
వాజ్పేయి పక్కనే ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభపరిణామంగా మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. ఈ ఇరువురి విగ్రహాలు కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నానికే కాక యావత్తు జిల్లాకే గర్వకారణమని మంత్రి రవీంద్ర ఈ సందర్భంగా అన్నారు.