మచిలీపట్నం:
జిల్లాలో ప్రమాదాలు నివారించుటకు రహదారి భద్రతపై ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా గోడపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనవరి 1 వ తేదీ నుండి 31వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఇందులో ముఖ్యంగా వాహనాల డీలర్లను, లారీ యజమానుల సంఘాలను, డ్రైవర్ శిక్షణ కేంద్రాలను భాగస్వాములు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు, డిపిటీవో వెంకటేశ్వర్లు, ఎంవిఐలు సిద్ధిక్, నాని, నారాయణస్వామి, సంగీతరావు ఏఎంవిఐ సోనీ ప్రియా తదితర రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.