మచిలీపట్నం:
శనివారం మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 47 డివిజన్ ప్రాంగణంలో శివగోపాల్ శ్రీశక్తి మహిళ పరస్పర సహకార డ్వాక్రా గ్రూపు మహిళల సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇంచార్జ్ డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ
డ్వాక్రా గ్రూపుల ద్వారా వచ్చే రుణాలను మహిళలు సద్వినియోగపరుచుకోవాలని మహిళల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. మహిళలు డ్వాక్రా ద్వారా తీసుకునే రుణాలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మహిళలు ఆర్థిక బలోపేతం కొరకు కూటమి ప్రభుత్వం
సంవత్సరానికి 3 గ్యాస్ బండలు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల పింఛన్ అందించడం, తల్లికి వందనం ద్వారా కుటుంబాలకు కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి డివిజన్ ఇన్చార్జిలు ఆళ్ళ మాధవ, మహమ్మద్ షాహీనా, వడ్డి చిరంజీవి కుమార్, విన్నకోట దుర్గా ప్రసాద్, విన్నకోట శ్రీను గారు, ఎడుంబాకుల వాసు, జోడు గుడుల చైర్మన్ దేవనూరి వీర బాబు,ఆర్పీ జయ,ఆర్పీ రమాదేవి, సి ఒ నాగమ్మ, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డంరాజు, వైస్ ప్రెసిడెంట్ సమీర్ డ్వాక్రా మహిళలు
సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.