మచిలీపట్నం:
త్రీముఖ సినీ చిత్ర యూనిట్ మచిలీపట్నంలో వరం సెంట్రల్ మాల్ నందు శనివారం సందడి చేశారు. జనవరి 2 న చిత్రం రిలీజ్ సందర్భంగా రాష్ట్రమంతా త్రిముక చిత్రం ప్రమోషన్ చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రం యూనిట్ మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హీరో యోగేష్ మాట్లాడుతూ బందరు తన స్వగ్రామం అని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగా కొనసాగుతున్న చిత్రం అన్ని అంశాలు తో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు.
సన్నీ లియోన్ ,షకలక శంకర్, జెమిని సురేష్ సినీ ప్రముఖులు ఈ చిత్రంలో నటించారన్నారు. 5 భాషలలో ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉందన్నారు. ప్రేక్షకులు త్రిముఖ సినిమాను ఆదరించాలని కోరారు.డేబ్ల్యూ సినిమాతో మచిలీపట్నంకు యోగేష్ ప్రేక్షకులను అలరించనున్నారు.