జాతీయ స్థాయి క్రీడలను మచిలీపట్నంలో నిర్వహించేలా సదుపాయాలు కల్పిస్తాం
నేషనల్ కాలేజీలో బందరు ఓల్డ్ క్రికెటర్స్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ 2025 ప్రారంభోత్సవం
మచిలీపట్నం :
కృష్ణా జిల్లాను క్రీడలకు కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నేషనల్ కాలేజీ మైదానంలో బందరు ఓల్డ్ క్రికెటర్స్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ 2025ను ప్రారంభించారు. గత 13 సంవత్సరాలుగా టోర్నీ నిర్వహించడం అభినందనీయం.
మసులా బీచ్ ఫెస్టివల్లో నేషనల్ బీచ్ వాలీ బాల్ పోటీల్లో దేశ విదేశాల నుండి క్రీడాకారులు వచ్చారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రౌండ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అంబటి రాయుడు ఆధ్వర్యంలో ఏపీలో ఒక క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నాం. మచిలీపట్నంలో క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేస్తాం.
స్థానికంగా పిల్లలకు సరైన గ్రౌండ్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీలైనంత త్వరగా మచిలీపట్నం క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. జాతీయ స్థాయిలో క్రికెటర్లు వచ్చేలా బందరులో సదుపాయాలు కల్పిస్తామన్నారు.
మసులా స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, ఏఎంసి చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, లంకె నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.