నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ.
మచిలీపట్నం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.30.12.2025 మంగళవారం నాడు ఉదయం 09:00 గంటలకు పెడన లోని విజయానంద డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు.
ఈ జాబ్ మేళాలో, హెటురో ల్యాబ్స్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏంఆర్ఎఫ్ టైర్స్ లిమిటెడ్, ముక్కు ఫైనాన్సియల్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్ ప్రిన్స్ జ్యూవెల్ ఇండస్ట్రీ ఇండియా లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, మోహన్ స్పింటెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్విన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, పేటిఎమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, సుధీర్ టింబర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ డి.విక్టర్ బాబు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్ కుమార్ తెలిపారు.
ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, డిసెంబర్ 30న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్ కార్డ్,సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 88977 72488, 99664 89796 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
