మచిలీపట్నం :
వంగవీటి మోహన రంగా 37 వ వర్ధంతిని పురస్కరించుకొని మచిలీపట్నం రేవతి సెంటర్లో గల రంగా విగ్రహాన్ని శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మచిలీపట్నం వైఎస్ఆర్సిపి పార్టీ ఇంచార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు).
ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పెద్ద ర్యాలీగా బయలుదేరి నగరంలో పలు ప్రాంతాలలో ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడమే రంగా లక్ష్యమని ఆయన సేవలను కొనియాడారు. విజయవాడ శాసనసభ సభ్యులుగా ప్రజాబలం కలిగిన ఏకైక నాయకుడు రంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డిప్యూటీ మేయర్ శీలం భారతి, శీలం బాబ్జి, సిలార్ దాదా, చిటికెన నాగేశ్వరరావు, మేకల సుబ్బన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.