మచిలీపట్నం:
ఉయ్యూరు ఏజీ అండ్ఎస్జీఎస్ కళాశాల లో రెండు రోజులపాటు నిర్వహించిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బాలుర బ్యాడ్మింటన్ పోటీలు బుధవారం సాయంత్రం ముగిశాయి. ఉత్కంఠ భరితంగా జరిగిన పోటీల్లో కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తృతీయ స్థానం సాధించారు.
వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె రాంజీ విజేతలను అభినందిస్తూ భవిష్యత్ లో మరింత ఉత్సాహంతో క్రీడల్లో రాణించాలని అభిలషించారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా ఆర్ విజయ కుమారి, కళాశాల పిడి డా.పి గోపి లు విద్యార్ధులను అభినందించారు.