ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మచిలీపట్నంలోని ఎలక్ట్రిషియన్స్ కోసం కాలనీ ఏర్పాటు చేసి అర్హులకు ఇళ్లస్థలా ఇవ్వాలని మచిలీపట్నం ఎలక్ట్రీషియన్స్ సర్వస్యత సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం మచిలీపట్నంలో రామానాయుడు పేట లోని రెస్టారెంట్ లో జరిగిన నగర ఎలక్ట్రిషియన్ల సర్వసభ్య సమావేశం లో ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణను స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర ను పార్లమెంట్ సభ్యులు బాల సౌరిని జనసేన ఇన్చార్జి బండి రామకృష్ణను కోరుతూ తీర్మానం చేశారు.
నగర ఎలక్ట్రిషియన్ ల సంఘ లీగల్ అడ్వైజర్ గా సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మహాలక్ష్మి ఎలక్ట్రికల్స్ అధినేత మామిడి మురళీకృష్ణ మాట్లాడుతూ ఎంతోకాలంగా ఎలక్ట్రిషన్ల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు. అర్హులైన నిరుపేద ఎలక్ట్రిషన్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి కాలనీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను మామిడి కృష్ణ కోరారు. ప్రభుత్వ రంగ ఎలక్ట్రిషన్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు ఉచితంగా ఏర్పాటు చేయాలని కోరారు.
సంఘ న్యాయ సలహాదారుడు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా యువ ఎలక్ట్రిషన్లు కంప్యూటర్ తో అనుసంధానమైన ఎలక్ట్రికల్ వైరింగ్ ను నేర్చుకోవాలని అన్నారు. వినియోగదారుల యొక్క నమ్మకాన్ని పెంచుకుంటూ వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల జాబితాలో ఎలక్ట్రిషన్ కూడా చేర్చి కార్మిక శాఖ ఇస్తున్న అన్ని సదుపాయాలు వర్తింపజేయాలని బాలాజీ కోరారు. త్వరలో మచిలీపట్నం ఎలక్ట్రీషియన్ల నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని బాలాజీ అన్నారు.
సీనియర్ ఎలక్ట్రీషియన్లు వెంకటేశ్వరరావు, మేకల వీర శివాజీ, మాదిరెడ్డి ఈశ్వర్, దుర్గాప్రసాద్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అపార్ అనుశక్తి కంపెనీ ఏరియా మేనేజర్ కిషోర్, పూర్వ సంఘ అధ్యక్షులు శ్రీను తదితరులు పాల్గొన్నారు.