డిసెంబర్ 23 24 తేదీలలో మురళి రిసార్ట్స్, పోరంకిలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో కృష్ణాజిల్లా నుండి పాల్గొన్న 11 మంది సభ్యులలో ఇద్దరు దక్షిణ భారత స్థాయికి ఎంపికయ్యారు అని జిల్లా విద్యాశాఖ అధికారి గారు శ్రీ యు వి సుబ్బారావు గారు తెలియజేశారు.
బాలల కేటగిరీలో గుడివాడ మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు చెందిన ఎస్ అశ్విన్ కుమార్ మరియు ఉపాధ్యాయుల కేటగిరిలో మచిలీపట్నం మండలం గుండుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ బి సోమేశ్వర రావు గారు విజేతలుగా నిలిచారు. విజేతలను జిల్లా విద్యాశాఖ అధికారి అభినందించారు.