MachilipatnamLocal News
December 28, 2025
కృష్ణా జిల్లా

నూతన చెత్త సేకరణ బండ్లను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర.

  • December 24, 2025
  • 0 min read
[addtoany]
నూతన చెత్త సేకరణ బండ్లను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర.
మచిలీపట్నం :
 
   మచిలీపట్నం నగరం 50 డివిజన్లో శానిటేషన్ పనులను మెరుగుపరిచేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ బాపిరాజు నూతన చెత్త సేకరణ తోపుడుబండ్లను కొనుగోలు చేశారు. ఈ చెత్త సేకరణ తోపుడుబండ్లను, 850 డబ్బాలను గనుల ,భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు. నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన 76 తోపుడు బండ్లు విలువ అక్షరాల 19 లక్షల 80 వేలుగా, డబ్బాలు 9 లక్షల 50 వేల రూపాయలుగా తెలిపారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత పై కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంసీ చైర్మన్ బండి రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు గడ్డం రాజు, తెలుగుదేశం సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుబియా ,తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు , కూటమి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *