చెన్నై హిందూస్థాన్ విశ్వవిద్యాలయం లో నిర్వహించిన సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాల్లో కృష్ణా విశ్వవిద్యాలయం ప్రతిభ కనబరిచి మూడవ రన్నరప్ గా నిలిచింది. డిసెంబర్ 19 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు దక్షిణ భారత స్థాయిలో జరిగిన యువజనోత్సవాల్లో నృత్య పోటీల్లో ప్రథమ స్థానం సాధించడమే కాకుండా పదమూడు రకాల అంశాల్లో పలు బహుమతులు సాధించి సత్తా చాటింది. క్లాసికల్ వోకల్ సోలో లో ద్వితీయ బహుమతి, క్లాసికల్ పర్క్యూషన్ లో నాల్గవ స్థానం, క్లాసికల్ నాన్ పిర్క్యూషన్ లో ద్వితీయ స్థానం, లైట్ వోకల్ సోలో లో మూడవ బహుమతి, ఇండియన్ గ్రూప్ సాంగ్ విభాగం లో మూడవ స్థానం లో పొందింది. ఫోక్ ఆర్కెస్ట్రా లో నాల్గవ స్థానం, క్రియేటివ్ కోరియోగ్రఫీ లో నాల్గవ స్థానం, ఫోక్ డాన్స్ లో ప్రథమ స్థానం, వన్ యాక్ట్ ప్లే లో నాల్గవ స్థానం, స్కిట్ లో నాల్గవ స్థానం, మిమిక్రీ లో ఐదవ స్థానంలో, రంగోలి లో నాల్గోవ స్థానం సాధించడమే కాకుండా ఓవర్ ఆల్ డాన్స్ కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. దక్షిణ భారత స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాల్లో మంచి ప్రతిభ కనబరిచి మూడవ రన్నరప్ గా నిలిచి బహుమతులు సాధించిన కృష్ణా విశ్వవిద్యాలయం బృందం కు ఉపకులపతి ఆచార్య కె. రాంజీ, రెక్టర్ ఆచార్య ఎంవి. బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష లు అభినందనలు తెలిపారు.