సుపరిపాలనపై జిల్లా స్థాయి వర్క్ షాప్
మచిలీపట్నం :
నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులకు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ లోని కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో సుపరిపాలన వారోత్సవాలలో భాగంగా జిల్లా అధికారులకు కార్యశాల నిర్వహించి సుపరిపాలన ఏవిధంగా అందించాలో సప్త సూత్రాలను వివరిస్తూ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరు ఓపికతో వింటారో వారు మంచి పరిపాలన అధికారిగా పేరు తెచ్చుకుంటారన్నారు. పరిపాలన ఏ స్థాయిలో ఉన్న సమానత్వం చాలా అవసరం అన్నారు.సుపరిపాలన అందించాలంటే సప్త సూత్రాలను విధిగా పాటించాలన్నారు. అందులో మొదటిది నిస్వార్థంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలన్నారు. తన వద్దకు పై స్థాయి గాని, కింది స్థాయి గాని ఎటువంటి వ్యక్తి వచ్చిన సమానంగా స్పందించి ఒకే విధమైన న్యాయం చేయాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా మన వద్దకు వస్తే మన సొంత అభిప్రాయాలను కాకుండా వాస్తవ విషయాలను తెలుసుకొని తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.చాలామందికి సరైన మార్గదర్శకం చేస్తే ఏ పనైనా చేయగలుగుతారన్నారు. ఏదైనా ఒక పని వలన తప్పు గాని జరిగితే బాధ్యులుగా ఉంచేందుకు జవాబుదారితనం చాలా ముఖ్యమన్నారు కార్యాలయాన్ని ఎలాంటి వ్యతిరేకతా లేకుండా దాచకుండా పారదర్శకంగా నడపాలన్నారు.సరైన నాయకత్వం వహించి అందరినీ ముందుకు నడిపించాలన్నారు. ఎవరైనా మన వద్దకు వస్తే ఓపికతో విని చేతనైన సహాయం, న్యాయం చేయాలన్నారు. అప్పుడే మన జీవితానికి సార్థకథ మంచి దీవెనలు లభిస్తాయన్నారు.అప్పగించిన పనులను మంచిగా ఆలోచించి సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు.పాలనలో పని చేయించేది, పాలసీ చేసేది రెండు తెలియాల్సి ఉంటుందన్నారు.ఈ సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, డిఎస్ఓ మోహన్ బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు శివరాం ప్రసాదు, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, డిటిడబ్ల్యుఓ ధూర్జటి ఫణి, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, వయోజన విద్య డిడి బేగ్, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

