మచిలీపట్నం:
ప్రముఖ దినపత్రికలోని వార్త ఆధారంగా సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ కృష్ణాజిల్లా, సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరక్టర్ షాహిద్ బాబు షేక్ పై ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం మల్లికార్జున నాయక్ కు ఫిర్యాదు చేసినట్లు తెలియచేసారు.
కృష్ణా జిల్లా సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరక్టర్ షాహిద్ బాబు షేక్ ఉద్యోగుల జీతాల బిల్లులు, 4వ తరగతి ఉద్యోగుల పదోన్నతులలో భారీగా అవినీతికి పాల్పడుతున్నారనీ, కార్యాలయానికి హాజరు కారనీ, కలెక్టర్ కార్యాలయంలో జరిగే పి.జి.ఆర్. ఎస్ కు కూడా హాజరు కార నీ, యస్.సి, ఎస్.టి, బిసి. ఉద్యోగులు అంటే అసలు గిట్టదనీ, హాస్టల్స్ లో పిల్లలు ఉన్నప్పటికి అడ్డదారిలో హాస్టల్స్ను ముసేస్తారనీ, హాస్టల్స్లో పనిచేసే వార్డెన్స్ దగ్గర సొమ్ములు లంచంగా తీసుకొని అర్హతలు లేకపోయినా ప్రమోషన్లు ఇస్తారనీ, జిల్లాలోని మోటూరు, ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నం వార్డెన్ల నుండి లక్షల్లో లంచం తీసుకొని A.S.W. లుగా ప్రమోషన్లు ఇచ్చారనీ దినపత్రిక లో వచ్చిన వార్తపై విచారణ జరిపించ వలసిందిగా ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.