కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ (UG) III మరియు V సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కూన రాంజీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా ఎన్ ఉష, పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి పాల్గొన్నారు.
వైస్ చాన్సలర్ రాంజీ మాట్లాడుతూ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా మరియు సక్రమంగా జరిగిందని తెలిపారు.
పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి వివరాలు తెలియజేస్తూ
UG III సెమిస్టర్ మొత్తం ఉత్తీర్ణత శాతం 51.85%
UG వి సెమిస్టర్ మొత్తం ఉత్తీర్ణత శాతం 66.31% గా నమోదైందని పేర్కొన్నారు. ఫలితాలు కృష్ణా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫలితాలపై పునర్మూల్యాంకనం (Revaluation) కోరుకునే విద్యార్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రీవ్యాల్యుయేషన్ దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 7,జనవరి 2026 అని తెలిపారు.