సత్య హాస్పిటల్, మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమంను కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సత్య హాస్పిటల్ డాక్టర్ సత్య ఫణింద్ర మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరానికి వచ్చిన వారిలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ (ఎముకుల పట్టుత్వం) ఎముకలలో కాల్షియం, ఖనిజ పదార్థాలను కొలిచి ఆస్టియోపోరోసిస్‌ను తనిఖీ చేశామన్నారు. ముఖ్యంగా కోర్టు సిబ్బంది కు వెన్నెముక, తుంటి మణికట్టులో ఎముక నష్టాన్ని పరీక్షించి తగిన మందులను సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ రామకృష్ణయ్య, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోతురాజు, రేవతి థియేటర్ ప్రోప్రైటర్ పుప్పాల మణిశేఖర్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.