ప్రపంచానికి శాంతియుత మార్గాన్ని చూపి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తన రక్తాన్ని చిందించిన త్యాగమూర్తి, కరుణామయుడు ఏసుప్రభువు అని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కీర్తించారు.
శుక్రవారం రాత్రి నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద గల శుభం కన్వెన్షన్ హాలులో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలలో రాష్ట్ర మంత్రి రవీంద్ర మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా మచిలీపట్నంలో వేడుకలు అందరము కలిసికట్టుగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ కలిసి మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చారన్నారు.
ఎన్ని కష్టనష్టాలు ఉన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో దేవుని ఆశీస్సులతో తమ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉందన్నారు.

2014 19 సంవత్సర కాలంలో కొన్ని చర్చిల నిర్మాణం కోసం కొన్ని నిధులు సమకూర్చామని అయితే తర్వాత ప్రభుత్వ మారడంతో ఆ నిధులన్నీ తిరిగి వెనక్కు వెళ్ళాయన్నారు తమ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని అందరము అన్నదమ్ముల వలె కలిసి మెలిసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు
అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు కేకును కట్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ సంస్థ డైరెక్టర్ హసీం బేగ్, జిల్లామైనారిటీ సంక్షేమ అధికారి రబ్బాని, కార్పొరేటర్ అనిత, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు విద్యాసాగర్,
మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కార్యక్రమ నిర్వాహకులు కరుణ కుమారు, బెరక్క మినిస్ట్రీ డైరెక్టర్ బి.ఎస్ కిరణ్ పాల్, సెంట్రల్ చర్చి పాస్టర్ బి సుకుమార్ స్థానిక దైవజనులు టీవీ జాషువా, వెస్లీ, వై.రాజు పలువురు మైనారిటీ ప్రజలు పాల్గొన్నారు.