కలెక్టర్లు పని చేయడం లేదంటే అది చంద్రబాబు వైఫల్యం కాదా??? —- మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజం
SSN
- December 19, 2025
- 1 min read
[addtoany]
మచిలీపట్నం:
కలెక్టర్లు పని చేయడం లేదంటే అది చంద్రబాబు వైఫల్యం అధికారులపై నింద వేసి తప్పించుకునేందుకు సీఎం యత్నం
—- మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజం
మచిలీపట్నంలోని వైయస్సార్‌సీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)
కలెక్టర్లు ప్రభుత్వ నిర్ణయాల డెలివరీ మెకానిజమ్ మాత్రమే పాలనా యంత్రాంగం అంతా సీఎం వద్దే. అదే దిశ తప్పింది
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్ర ప్రజాగ్రహం కోటిమందికి పైగా స్వచ్ఛందంగా సంతకాలు ప్రజా ఉద్యమానికి ఊరూ, వాడా ప్రతిచోటా ఆదరణ అన్ని అంశాలపై గవర్నర్‌గారికి సమగ్రంగా నివేదన
యథేచ్ఛగా ప్రభుత్వ భూముల పందేరం.. ఎకరా భూమి రూపాయికి లీజుకెలా ఇస్తారు?
కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా అవినీతి అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం
ఏ మాత్రం లేని సంక్షేమం..ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు కలగా మారిన వైనం ఇది అన్నింటా విఫలమైన చేతకాని కూటమి ప్రభుత్వం
మచిలీపట్నం:
కలెక్టర్లు సరిగా పని చేయడం లేదంటే అది చంద్రబాబు వైఫల్యమేనని మాజీ మంత్రి, వైయస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు కలెక్టర్లు కేవలం డెలివరీ మెకానిజమ్ మాత్రమే అని, వారికి దిశానిర్దేశం చేసేది సీఎం అని ఆయన గుర్తు చేశారు. తన వైఫల్యాలు, తప్పులను అధికారులపై వేసి, సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కలెక్టర్లు, ఎస్పీల సమావేశం పేరుతో సీఎం చేసింది పాలనా సమీక్ష కాదని, ఒక కాలక్షేప కార్యక్రమం అని తేల్చి చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు మెరుగైన వైద్యం దూరం చేస్తున్నారని మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో పేర్నినాని ఇంకా ఏమన్నారంటే..:
సీఎం చంద్రబాబుగారు రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను పిలిచి వారిని దాదాపు 20 గంటలు కూర్చోబెట్టారు. ఈ సమావేశంలో పాలనా సమీక్ష జరగాల్సిన చోట, అధికారులు ఎలా ఉండాలి. ఎలా ఉద్యోగం చేయాలి. ఎవరైనా లావుగా ఉంటే బరువు ఎలా తగ్గాలి. ఫిట్‌గా ఎలా ఉండాలి వంటి అంశాలపై కాలక్షేప బఠానీ కబుర్లు చెప్పారు.
ఇంకా ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘మీరు గొప్పగా పని చేస్తున్నామని అనుకుంటున్నారు. నేనూ అలా అనుకుంటున్నాను. కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు’ అంటూ కలెక్టర్లు, ఎస్పీల పనితీరుపై నిందలు వేశారు.
మొట్టమొదటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మాత్రం చంద్రబాబు పూర్తిగా భిన్నంగా మాట్లాడారు. ‘మనది పొలిటికల్ గవర్నెన్స్. మా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు మీ వద్దకు వస్తారు. వారికి మర్యాద ఇవ్వండి. మా ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాకుండా చూసుకోండి’ అంటూ అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు చెప్పిన మాటలకు, ఇవాళ చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది. ‘మీరు సరిగ్గా పని చేయడం లేదు, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు’ అంటూ అధికారులనే లక్ష్యంగా చేసుకున్నారు. నిజానికి కలెక్టర్లు, ఎస్పీలు కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే. ప్రభుత్వాన్ని నడిపించడం, విధానాలు రూపొందించడం, అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేయడం సీఎం బాధ్యత. ముఖ్యమంత్రి బాధ్యత. కలెక్టర్లు, ఎస్పీలు సరిగ్గా పని చేయడం లేదంటే దాని అర్థం ముఖ్యమంత్రి పనితీరు బాగోలేదన్నదే.
ఎకరానికి రూపాయి అద్దెకు ప్రభుత్వ భూములను 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వారికి ఇవ్వడం అంటే అమ్మేయడమే. పీపీపీ ఆస్పత్రి బయట ‘ప్రభుత్వ ఆసుపత్రి’’ అని పెద్ద బోర్డు పెట్టి, కింద చిన్న అక్షరాల్లో ప్రైవేట్ వ్యక్తి పేరు రాస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే.
రాష్ట్రంలో ఉన్న మీ భూములను కూడా ఎకరా రూపాయి చొప్పున 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వండి. 66 ఏళ్ల తర్వాత మళ్లీ దేవాన్ష్ లేదా ఆయన కొడుక్కి అప్పగిస్తారు. చంద్రబాబు తత్వం మొత్తం గాలిలో మేడలు కట్టడం, పిట్టల దొర కబుర్లు చెప్పడం, అసాధ్యాన్ని సాధ్యమని చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలే.
చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ కలిసి నడుపుతున్న బసవతారకం ఆసుపత్రిలో 70 శాతం ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం వద్ద భూమి తీసుకున్నప్పుడు అంగీకరించారు. అక్కడ పేదల్ని పట్టించుకునే పరిస్థితే లేదని తీవ్రంగా విమర్శించారు.
వరి సాగు తగ్గిస్తే యూరియా రూ.800 ఇస్తానని, ఏడాదిలో నేరాలు తగ్గాలంటూ చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లో మాట్లాడుతున్నాడు. ఆయన పాలనలో నేరాలు తగ్గలేదు–ఘోరాలు పెరిగాయి. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, హింస, హత్యలు 19 నెలల పాలనకు నిదర్శనంగా మారాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలను నిర్లక్ష్యం చేసి హోం శాఖలో జోక్యం చేసుకుంటూ మాటలకే పరిమితమయ్యారు. భీమవరం, పిఠాపురం వంటి ప్రాంతాల్లో పేకాట, ల్యాడ్ సెటిల్‌మెంట్లు, రాజకీయ జోక్యంతో పోలీసు–రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దళితులపై కుల వివక్ష, జర్నలిస్టులపై దాడులు జరిగినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం చేతకాని పాలనకు స్పష్టమైన నిదర్శనం.
వైయస్ జగన్ ప్రభుత్వం పేదలపై భారం పడకూడదని పారదర్శకంగా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానం తీసుకొస్తే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి వంద శాతం ప్రైవేటీకరణ చేసింది. దీనికి వ్యతిరేకంగా కోటి మందికిపైగా ప్రజల మనోభావాలను వారి సంతకాల రూపంలో గురువారం వైయస్ జగన్ గవర్నర్‌గారికి అందించారు.
పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నది తానేనని బహిరంగంగా చెప్పుకుంటూ, ప్రశ్నించే వారిని బెదిరించడం ఆయన అవివేకానికి నిదర్శనం. పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం దొరుకుతుందనడం అబద్ధం. ఉచిత, నాణ్యమైన చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధ్యం. ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీకి ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని మంత్రి, అధికార మదంతో మాట్లాడుతున్నారు.
జగన్‌గారిపై కేసుల విషయాన్ని వక్రీకరిస్తూ మాట్లాడే నైతిక హక్కు సత్యకుమార్‌కు లేదు. అధికార మదంతో మాట్లాడడం సత్యకుమార్ అవివేకానికి నిదర్శనం అని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

