చెడును పారదోలి మంచిని ఆహ్వానించడమే క్రిస్మస్ పండుగ సందేశం అని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం కృష్ణా విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యములో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మన దేశంలోనీ ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహించడం జరుగుతోందని, ఇప్పుడు అదే విధంగా మన రాష్ట్రంలో కూడా నిర్వహించడం అనవాయితీగా వస్తోందన్నారు.
రసాయన శాస్త్ర విభాగం అధిపతి డా. సుజాత, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డా. సుశీల, సహాయ ఆచార్యులు డా. అనిల్ తదితరులు ప్రసంగించారు. తొలుత రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్ధులు పాటలు, నృత్యాలు, క్రిస్మస్ సందేశం ఇచ్చేలా నాటకం ప్రదర్శించారు.