పేద విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని
కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ అన్నారు.
కృష్ణా విశ్వవిద్యాలయంలో ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొడాలి ఆకాష్ బ్రైన్ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి ఆపరేషన్ నిమిత్తం కావలసిన సొమ్ములో కొంత
సొమ్ము సాయం అందించేందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చింది.
ఉపకులపతికి సంస్థ అధ్యక్షుడు జి కిషోర్,
కార్యదర్శి డా హసీంబేగ్, ఉపాధ్యక్షుడు బొమ్మిరెడ్డి స్వామి, జిల్లా కో కన్వీనర్ ముదిగొండ శాస్త్రి లు రూ. 25 వేలు ఆర్ధిక సాయం అందచేశారు.
ఈ సందర్భంగా ఉపకులపతి రాంజీ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం విద్యార్ధులు
ఒక లక్షా యాభై వేలు ఇచ్చారన్నారు. తోటి స్నేహితుని ఆదుకోవడంలో విద్యార్ధులు చూపిన చొరవ స్నేహానికి దర్పణంగా నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొన్నారు.