రాష్ట్ర సచివాలయంలో మొదటిరోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్
SSN
- December 17, 2025
- 1 min read
[addtoany]
కొన్ని గంటల్లో ఈ–కార్యాలయ దస్త్రాలను పరిష్కరించడంలో నలుగురు జిల్లా కలెక్టర్లు నిలవగా అందులో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అగ్రస్థానంలో నిలిచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలోని 5 వ బ్లాక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, మంత్రివర్గ సహచరులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో కలసి మొదటిరోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గత 3 నెలలుగా జిల్లాల వారీగా ఈ–కార్యాలయ దస్త్రాల పరిష్కారం పై సమీక్షిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ తో పాటు నలుగురు జిల్లా కలెక్టర్లు ఒకరోజు కంటే తక్కువగా కొన్ని గంటల్లోనే ఈ- కార్యాలయ దస్త్రాలను పరిష్కరించారన్నారు. అందులో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రథమ స్థానంలో నిలిచారని అభినందించారు.
క్షేత్ర స్థాయి కార్యాలయాల్లో సిబ్బంది ముఖ్యంగా వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు రీ సర్వే కార్యక్రమంలో భాగంగా ఉదయమే గ్రౌండ్ ట్రూతింగ్ కోసం వెళ్తుంటారని వారికి విధుల హాజరు నుండి మినహాయింపు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు.
అంతకు మునుపు క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరుపై సమీక్షిస్తూ 74 శాతం మంది విధులకు హాజరవుతున్నట్లు, 26% మంది హాజరు వేయడం లేదని, కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న ప్రజాభిప్రాయం ఉందని రాష్ట్ర ఐ టి ఈ అండ్ సి ఆర్టీజియస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ చెప్పడంతో జిల్లా కలెక్టర్ పై విధంగా స్పందించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ కార్యాలయానికి రాని వారి పట్ల కలెక్టర్లు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, క్షేత్ర పర్యటనకు వెళ్లిన వారికి మినహాయింపు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని కార్యదర్శికి సూచించారు.
భూగర్భ జలాలపై జిల్లాల వారీగా విశ్లేషిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణాజిల్లాలో ఈ ఏడాది జూన్ 1 వ తేదీ నాటికీ 9.45 మీటర్ల లోతులో నీరు ఉంటే ప్రస్తుతం నవంబర్ 25 నాటికి 7.69 మీటర్ల లోతుకు వచ్చిందన్నారు. పంచాయతీరాజ్ శాఖతో ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చే వర్షాల తర్వాత పెంపుదల చేయాలని సూచించారు.
ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ వివరణ కోరగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ జిల్లాల్లో బాపులపాడు, గన్నవరం వంటి నాలుగు మండలాలు అప్ల్యాండ్ లో ఉన్నాయని, అక్కడ 3 నెలల్లో భూగర్భ జలాలు పెంపుదలకు తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ కాన్ఫరెన్స్ లో నగరంలోని కలెక్టరేట్ విసీ హాల్ నుండి సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజ, బీసీ సంక్షేమ అధికారి రమేష్, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర కుమార్, జడ్పీటీసీఈఓ ఆనంద్ కుమార్, డిసిఓ చంద్రశేఖర్ రెడ్డి, డి.ఎస్.ఓ మోహన్ బాబు, డిపిడిఓ వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

