కృష్ణా జిల్లా పోలీస్
SSN
- December 17, 2025
- 1 min read
[addtoany]
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను అదుపులోనికి తీసుకుని సుమారు 5,60,000/- విలువ కలిగిన 112 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు. బుధవారం మీడియా సమావేశంలో కేసు పూర్వాపరాలను కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, వెల్లడించారు.

గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 16, డిసెంబర్ 2025 సాయంత్రం 4 నాలుగు గంటలకు BB గూడెం అండర్పాస్ వద్ద గన్నవరం ఎస్ఐ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ODO2 BC 3555 నెంబర్ కలిగిన తెలుపు రంగు CRETA కారు లో ఉన్న వ్యక్తి పోలీస్ వారిని గమనించి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో ఆ వాహనాన్ని నిలువరించి తనిఖీలు చేపట్టారు.

ఆ కారులో సుమారు 5,60,000/- విలువ కలిగిన ఒక్కొక్క ప్యాకెట్ కేజీ చొప్పున మొత్తం 112 ప్యాకెట్లు గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అందులో ఉన్న పూణే పట్టణం, మహారాష్ట్రకు చెందిన దీపక్ తుపే s/o అబాజీ తుపే (39 సంవత్సరాలు) అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించగా అతడు పూణే కు చెందిన వైష్ణవి లవన్ అనే వ్యక్తి గంజాయి కోసం ఒరిస్సా రాష్ట్రంలోని బలంగీర్ కు పంపించడం జరిగిందని. ఈ గంజాయిని అక్కడ ఉన్న రాజ్ కుమార్ మరియు సురాన్ కర్ణ అనే వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి పూణేకు తీసుకు వెళ్తున్నట్లుగా, నేరాన్ని అంగీకరించడంతో అదుపులోనికి తీసుకొని అతనిపై గన్నవరం పోలీస్ స్టేషన్ లో cr.no 290/2025 u/s 8(b) r/w 20(b) (2) (c)of NDPS Act ప్రకారం కేసు నమోదు చేశారు.
గంజాయి అదుపులోనికి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి ఒక వ్యక్తిని, రవాణా చేస్తున్న కారును, 112 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులను అందజేయడం జరిగింది.
ఎస్ పి విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం గానీ రవాణాలను గాని జిల్లాలో ఎక్కడ జరగనివ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగింది. కేవలం రవాణా దారుల్ని మాత్రమే కాక ఎవరైతే విక్రయిస్తున్నారో వారిని, సరఫరా చేస్తున్న వారిని కూడా అదుపులోనికి తీసుకునేలా చర్యలు చేపడుతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యల్లో గంజాయి నిర్మూలన కూడా ఒకటి కావున కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఆ దిశగా పనిచేస్తుంది. అంతేకాక గంజాయి రవాణా చేసేవారు సేవించే వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతూ వారిపై NDPS Act ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేయాలని చూసిన, వారికి సహకరించిన వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. సులభంగా వచ్చే నగదు పై ఆశపడి అనవసరంగా జీవితాలను కేసులు పాలు చేసుకోవద్దని తెలియజేశారు.
అలాగే గంజాయి కి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు మరియు ఈగల్ టీం 1972 హెల్ప్ లైన్ నెంబర్ కి సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వివి నాయుడు గారు, అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ బి సత్యనారాయణ గారు, గన్నవరం డిఎస్పి సిహెచ్ శ్రీనివాసరావు గారు, గన్నవరం CI BV శివ ప్రసాద్ గారు, ఈగల్ టీం సీఐ ఎం.రవీంద్ర గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

