MachilipatnamLocal News
December 28, 2025
కృష్ణా జిల్లా

భారత మాజీ ప్రధాని మంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహం ఆవిష్కరణ

  • December 17, 2025
  • 1 min read
[addtoany]
భారత మాజీ ప్రధాని మంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహం ఆవిష్కరణ
జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి
 
అటల్ జీ అంటేనే నమ్మకం, అభివృద్ధి, సుపరిపాలన
 
తెలుగుజాతి అటల్ బిహారీ వాజ్ పేయికి రుణపడి ఉంటుంది
 
ఆర్థికంగా ఎదగడమే కాదు.. నైతిక విలువలు కూడా చాలా ముఖ్యం
 
నాకు స్ఫూర్తినిచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి
 
మచిలీపట్నంలో అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
 
భారత మాజీ ప్రధాని మంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహం ఆవిష్కరణ
 
మచిలీపట్నం: 
 
   జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి. అటల్ జీ అంటేనే నమ్మకం, అభివృద్ధి సుపరిపాలన అని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
 
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్డీయే ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఈ రోజు వాజ్ పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం, విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నా. అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన యాత్ర ధర్మవరంలో ప్రారంభమైంది. ఈ నెల 25న అమరావతిలో యాత్ర ముగుస్తుంది. అటల్ జీ గొప్పదనమే కాదు.. ఆయన సమాజానికి చేసిన సేవ, ఆయన నైతిక విలువలపై మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మత్స్యకార గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఆనాటి సింగపూర్ ప్రధాని లీ క్వాన్ యూ, మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందుగా తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్ పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను. 
 
*అటల్ జీ అంటేనే నమ్మకం, అభివృద్ధి సుపరిపాలన*
 
సమాజంలో నైతిక విలువలు పెంపొందించేందుకు నేను కృషి చేస్తున్నాను. సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి గారు. ఆయన గురించి ఎవరిని అడిగినా గొప్పగా చెబుతారు. ప్రతిపక్షమే లేని వ్యక్తి వాజ్ పేయి గారు. చిన్నవయసు నుంచే ఆయన జీవితాన్ని కవిత్వానికి, దేశానికి అంకితం చేశారు. 18 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దేశం కోసం జైలుకు వెళ్లారు. అటల్ బిహారీ వాజ్ పేయి అంటేనే నమ్మకం, అటల్ జీ అంటేనే అభివృద్ధి, అటల్ జీ అంటేనే సుపరిపాలన. ఆయన మూడుసార్లు ప్రధాని అయ్యారు. మొదటిసారి కేవలం 13 రోజులే ప్రధానిగా ఉన్నారు. మెజార్టీ లేకపోయినా ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు సాధించాలని కోరుకుంటారు. కానీ నైతిక విలువల కోసం నిలబడ్డారు. తర్వాత ఆయనకు తిరుగే లేకుండా పోయింది.
 
*దేశ భద్రత, అభివృద్ధికి కృషి చేశారు*
 
ఫోఖ్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించారు. దేశ భద్రత కోసమే న్యూక్లియర్ టెస్ట్ అని చెప్పిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి గారు. కార్గిల్ లో పాక్ దురాక్రమణను సమర్థంగా తిప్పికొట్టారు. ఈ రోజు ఆయనను మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓ వైపు దేశభద్రత, దేశ అభివృద్ధిని ఆయన ముందుకు తీసుకెళ్లారు. స్వర్ణ చతుర్భుజి తీసుకువచ్చారు. అద్భుతమైన రోడ్లు వేశారు. చంద్రబాబు గారు కోరితే టెలికాం మొత్తం డీరెగ్యులరైజేషన్ చేశారు. అహర్నిశలు కష్టపడి సంస్కరణలు తీసుకువచ్చారు. ఈ రోజు అద్భుతమైన ఎయిర్ పోర్టులు చూస్తున్నామంటే కారణం అటల్ బిహారీ వాజ్ పేయి గారి సంస్కరణలే.
 
*తెలుగుజాతి అటల్ బిహారీ వాజ్ పేయికి రుణపడి ఉంటుంది*
 
దేశాన్ని, హిందీని ఎల్లప్పుడూ ప్రేమించేవారు. యునైటెడ్ నేషన్ లో హిందీలో మాట్లాడి స్టాండింగ్ ఓవేషన్ పొందిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి గారు. నాకు అటల్ జీ గారిని కలిసే అవకాశం దక్కలేదు. ఆయన గురించి చంద్రబాబు గారి వద్ద తెలుసుకున్నాను. వారిద్దరి మధ్య ప్రేమ చూస్తే ఒక తండ్రికి, కుమారుడికి మధ్య ఉన్న ప్రేమ. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఢిల్లీకి వెళితే.. కుమారుడు వస్తే తండ్రి ఎంత సంతోషపడతారో ఆ విధంగా వాజ్ పేయి గారు ఆనందపడేవారు. 1998లోనే ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడింది. ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధికి కారణం వాజ్ పేయి గారు. ఐఎస్ బీ సంస్థ కావాలని చంద్రబాబు కోరితే కలిసికట్టుగా తీసుకువచ్చారు. బీమా నియంత్రణ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటుచేశారు. ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ నిర్వహణకు నిధులు కేటాయించిన వ్యక్తి వాజ్ పేయి గారు. తెలుగుజాతి ఆయనకు రుణపడి ఉంటుంది. ఇండియా ఫస్ట్ అనేది వాజ్ పేయి ఆలోచన. దేశాన్ని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డారు. ప్రధానిగా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నారు. ఏనాడు అధైర్యపడలేదు. కలిసికట్టుగా ముందుకు వెళదామని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన
 
*వాజ్ పేయి మార్గంలోనే ప్రధాని మోదీ వెళ్తున్నారు*
 
వాజ్ పేయి గారి మార్గంలోనే ప్రధాని మోదీ గారు వెళ్తున్నారు. ప్రధానమంత్రి గారికి కూడా యువకులంటే చాలా ఇష్టం. వారికి అండగా నిలుస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పొరుగుదేశానికి గట్టిగా బుద్ధి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంటే.. ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తోంది. గడిచిన 18 నెలల్లో ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయంటే, ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందంటే 2024 ఎన్నికల్లో అందరం కలిసి సాధించుకున్న విజయమే కారణం. 175 స్థానాల్లో 164 స్థానాల్లో కూటమి గెలిచింది. ఒక పవిత్ర బాధ్యత మా భుజస్కందాలపై ఉంది. మేం అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళతాం. రాష్ట్రాన్ని అభివృద్ధి దారిలో పెడతాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. 
 
*ఆర్థికంగా ఎదగడమే కాదు.. నైతిక విలువలు కూడా చాలా ముఖ్యం*
 
ఏ మార్గం అయితే అటల్ జీ మనకు చూపించారో ఆ మార్గంలో మనం నడవాలి. ప్రధాని గారు 2047 నాటికి దేశం అభివృద్ధి సాధించాలని చెబుతున్నారు. ఆర్థికంగా ఎదగడమే కాదు.. నైతిక విలువలు కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువల గురించి బోధిస్తున్నాం. నైతిక విలువలు లేని సమాజం సమాజమే కాదు. అందుకే అటల్ జీని ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలు పెంచుకోవాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మొదటి విగ్రహం మంగళగిరిలోనే ఏర్పాటుచేస్తామని కోరాను. కార్యక్రమం ముగిసిన తర్వాత వాజ్ పేయి గారి పెద్ద విగ్రహం మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తాం. నన్ను ఇన్ స్పైర్ చేసిన నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి గారు. నేను పట్టుదల, కమిట్ మెంట్ తో పనిచేస్తున్నానంటే కారణం వాజ్ పేయి గారు. ఆయన మార్గంలోనే నడుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నానని అన్నారు.
 
*మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..* భారత రత్న, సంస్కరణల ధీశాలిగా పేరొందిన వాజ్‌పేయి విగ్రహం బందరులో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నప్పడు వాజ్ పేయి అండగా నిలిచారు. తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తోడుగా నిలిచి దేశ అభివృద్ధికి తోడ్పాటునందించారు. 
 
కూటమి పాలనలోనే రాష్ట్రం దేశం ఎప్పుడూ అభివృద్ధి బాటలో నడుస్తోంది. అందుకే ప్రజలు ఈ సారి ఏకంగా 94శాతం సీట్లు అందించి అండగా నిలిచారు. విప్లవాత్మక మార్పులతో రాష్ట్రాన్ని అభ్యున్నతి పథంలో నడిచేందుకు మద్దతు పలికారు. ప్రజల సహకారం కారణంగానే నేడు ప్రపంచ దేశాలతో భారత దేశాన్ని అభివృద్థి పథంలో పరుగులు పెట్టిస్తున్నాం. మరోవైపు ఏపీని కూడా ఇతర రాష్ట్రాల కంటే మెండుగా అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనేక కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేందుకు కట్టుబడ పని చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
 
కార్యక్రమంలో శాసనమండలి బీజేపీ పక్షనేత సోము వీర్రాజు, పెడన, పామర్రు, గుడివాడ, అవనిగడ్డ, పెనమలూరు, పశ్చిమ విజయవాడ నియోజకవర్గాల శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, మండలి బుద్ధ ప్రసాద్, బోడె ప్రసాద్, సుజనా చౌదరి, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) ఛైర్మన్‌ బండి రామకృష్ణ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్ట ప్రసాద్, బిజెపి జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్,మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, పీవీ గజేంద్రరావు తదితర కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *