ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు.
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో స్వాతంత్ర్య సమరయోధులు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ పూలమాలలు వేసి పుష్పాలతో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీజీ వెంట నడిచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అర్పించిన మహనీయులని, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆధ్యులుగా నిలిచారని ప్రశంసించారు. ఆయన చేసిన త్యాగాన్ని నేడు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం అన్నారు.
తెలుగు జాతి గర్వించే విధంగా అందరూ కలిసికట్టుగా రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డిఓ స్వాతి, జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, డ్వామా పీడీ శివప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖరు, డిఎస్ఓ మోహన్ బాబు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, డిపిఓ డాక్టర్ జె అరుణ, జిల్లా ఉద్యాన అధికారి జె జ్యోతి, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.