మచిలీపట్నం :
ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ నాటికి తొలిదశ నాలుగు బెర్తుల ఓడరేవు నిర్మాణం పూర్తవుతుందని మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాసు సింగపూర్ బృందం సభ్యులకు వివరించారు.
బుధవారం సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలో జిల్లాలో ఒకరోజు పర్యటనకు వచ్చిన సింగపూర్ బృందం కలెక్టరేట్లో సమావేశం అనంతరం బందరు ఓడరేవును సందర్శించారు.
ఆక్కడ జరుగుతున్న ఓడరేవు నిర్మాణ పనులను పరిశీలించారు.
మొదటి దశ ప్రాజెక్ట్ లేఅవుట్ వద్ద మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాసు నిర్మాణం పనుల గురించి సింగపూర్ బృందానికి వివరాలు తెలియజేశారు. ఓడరేవు 2000 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, 13 వందల మంది కూలీలు పనిచేస్తున్నారని తొలిదశ నాలుగు బెర్తుల ఓడరేవు నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తవుతుందని వివరించారు .
ఈ పర్యటనలో సింగపూర్ బృందం సభ్యులు డిప్యూటీ సీఈవో తే లియన్ చెన్, సుస్థిర వ్యూహాత్మక ప్రాజెక్టు సీనియర్ మేనేజర్ నిషా షర్డా, ఆర్థిక కన్సల్టెంట్ చువా టెక్ హిం, మరి టైం బోర్డు మారి టైం బోర్డు పుల్లారావు ప్రణాళిక శాఖ రాష్ట్ర ప్రణాళిక శాఖ డైరెక్టర్ రాంబాబు సమన్వయ అధికారి డ్రామా పీడీ శివప్రసాద్ తదితర అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.