MachilipatnamLocal News
February 12, 2026
Uncategorized

చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డ పేర్ని నాని

  • January 6, 2026
  • 1 min read
[addtoany]
రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ విజయం తథ్యం 
 
మచిలీపట్నం :
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పై కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. మచిలీపట్నం సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్ని వెంకట్రామయ్య మాట్లాడుతూ హైదరాబాద్ భోగాపురం ఎయిర్పోర్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టినట్లు ఫోటోలు దిగటం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వలనే ఇండిగో విమానాల విషయంలో భారతదేశం ప్రపంచ దేశాల ముందు తలదించుకుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు నాయుడు కు సంబంధం లేదని అన్నారు. 2014 – 19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 5000 ఎకరాలు కావాలని రైతుల వద్ద నుండి లాక్కోవాలని చూసిన ద్రోహి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2200 ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ కు భూ సేకరణ చేసి నిర్మించామని అన్నారు. వైజాగ్ పోర్ట్ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ కి 6600 కోట్లతో సిక్స్ లైన్స్ జాతీయ రహదారి మంజూరు చేస్తున్నట్లు మంత్రి గడ్కరీ గతంలో ప్రకటించాడు. దీనికి కారణం జగన్ కాదా అని ప్రశ్నించారు.
 
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందడం లేదని విమర్శించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగే అధికారం లేదన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి వేయటానికి చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారన్నారు.
 
2024 ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు జగన్ పెంచారని విమర్శించి, మీటర్ల బద్దలు కొట్టమని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే మీటర్లను బిగిస్తున్నారు ఎందుకో ప్రజలకు చెప్పాలన్నారు. వాలంటర్ల కు 10వేలు ఇస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం వాలంటీర్లు లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.
 
మెడికల్ కాలేజ్ లు ఎకరం భూమి రూపాయి కి, హాస్పిటల్ ఫ్రీ అని రెండేళ్లు డాక్టర్లు జీతాలు ఇస్తామని ప్రకటించిన ఒక్కరు కూడా టెండర్లను వేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో ప్రజలకు తెలుసు అన్నారు. విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కిమ్స్ ఆస్పత్రిలో ఉన్న ప్రేమ్ చాంద్ షా కి ఆదోని మెడికల్ కాలేజ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో చాంద్ షా అనే వ్యక్తి లేరు. చంద్రబాబు నాయుడుకి దమ్ము ధైర్యం ఉంటే కిమ్స్ ఆస్పత్రికి ఉన్న సంబంధాలే అధికార పూర్వకంగా తెలియజేయగలరా అని సవాలు విసిరారు.
 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదన్నారు. వైఎస్సార్ సీపీ వాళ్లపై కక్ష సాధించడానికి పోలీసులకు మాత్రమే ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయి అని ఇంకెవరికి పదో తారీకు లోపు జీతాలు పడిన దాఖలాలు లేవని పేర్ని ఎద్దేవా చేశారు. పోలీసులకు ఒక్క సరెండర్ లీవ్ అయినా కూటమి ప్రభుత్వం ఇచ్చారా? సంవత్సరం లో మూడు సార్లు సరెండర్ లీవ్ లు వేయాలి కాదా? ఎందుకు వేయడం లేదు అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ దిగజారిపోతుందని కేంద్రం చెప్పటంలో ఆంతర్యం ఏమిటో చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు అన్నారు. ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చంద్రబాబు పై సహాయ నిరాకరణ చేయడం తద్యమని అన్నారు. హోం గార్డులను కానిస్టేబులుగా మార్చుతామని వాగ్దానం ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఎందుకు చేయడం లేదు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. చంద్రబాబు చరిత్ర అసత్యాలు, బురిడీలు, మాయమాటలు చెప్పడమేనని అన్నారు.
 
రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవిని చేపడతారని పేర్ని నాని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసేసామని చంద్రమనాయుడు చెపుతున్నారు అని ఇప్పుడే కాదు ఇంకెప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డిని అనగాతొక్కడం సాధ్యపడే విషయం కాదని అన్నారు. ఇప్పటికే తెలుగుదేశం అన్ని విధాలుగా అప్రతిష్ట పాలయ్యిందని అన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *