అట్టహసంగా వైసీపీ కోటి సంతకాల ప్రతుల వ్యాను తరలింపు
మచిలీపట్నం:
ఉత్సాహంగా పాల్గొన్న వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు.
కృష్ణాజిల్లా నుండి 4 లక్షల సంతకాలతో గవర్నర్ కి పంపించే కార్యక్రమం. – – – పేర్ని నాని
జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో సోమవారం కోటి సంతకాల ప్రతుల తరలింపు కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రామానాయుడు పేట లోని పార్టీ కార్యాలయం నుంచి కోనేరు సెంటర్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పైగా భారీ ర్యాలీ నిర్వహించారు.
కోటి సంతకాల ప్రతులున్న వాహనాన్ని విజయవాడ లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు నియోజవర్గాల పార్టీ ఇన్చార్జులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రాము, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, దేవభక్తుని చక్రవర్తి తదితరులు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. సంపద సృష్టిస్తానని చెప్పిన పెద్దమనిషి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల మీద 2 లక్షల
66 వేల 175 కోట్ల రూపాయలు 18 మాసాల్లో అప్పులు చేశారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించొద్దని. డౌన్ డౌన్ చంద్రబాబు, కూటమి ప్రభుత్వం.., ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం.. అంటూ నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక తో పాటు పలు నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులు, నాయకులు దాదాపు 3000 పైగా కార్యకర్తలు పాల్గొనడం విశేషం.

